సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి కుంట్లూరులో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ తైక్వాండో క్రీడాకారుడు అంబటి ప్రణీత్ బెస్తను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ సత్కరించింది. నల్గొండ పట్టణ వాసి ప్రణీత్ ప్రతిభను గుర్తిస్తూ... ఉత్తమ ఛత్రపతి శివాజీ అవార్డ్ అందించి గౌరవించింది. ఇప్పటికే ప్రణీత్ జాతీయ స్థాయి తైక్వాండోలో 4 సార్లు పాల్గొన్నట్లు సంస్థ ప్రతినిధులు కొనియాడారు.
తైక్వాండో క్రీడాకారుడు అంబటి ప్రణీత్‌కు ఛత్రపతి శివాజీ అవార్డు - sports news
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి కుంట్లూరులో జాతీయ క్రీడా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ తైక్వాండో క్రీడాకారుడు అంబటి ప్రణీత్ బెస్తను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ సత్కరించింది.
chatrapathi shivaji award to taikwando sports man praneeth
మణిపూర్, దిల్లీ, కోల్‌కతా, ఆగ్ర జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రణీత్... ఉత్తమ ప్రతిభ చాటినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 10 సార్లు తైక్వాండో పోటీలకు ఎంపికైతే 5 సార్లు బంగారు పతకం సాధించినట్లు ప్రణీత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జాతీయ రెఫరీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తన ప్రతిభను గుర్తించి సత్కరించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఉత్తమ ఛత్రపతి అవార్డు ఇవ్వడం పట్ల ప్రణీత్ హర్షం వ్యక్తం చేశారు.