అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని మినహాయింపులు కల్పించటం వల్ల పలు ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. చారిత్రక చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు శుక్రవారం ఉదయం నుంచే ప్రారంభించారు. పర్యాటక ప్రాంతమైన చార్మినార్... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో కిటకిటలాడింది.
చార్మినార్‌కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు - charminar open
కరోనా వల్ల హైదరాబాద్‌లో చాలా రోజులుగా బోసిపోయిన చార్మినార్ ఇప్పుడు మళ్లీ చమ్కాయిస్తోంది. సందర్శకులతో పాటు వ్యాపారులతో పరిసరప్రాంతాలన్ని కిటకిటలాడుతున్నాయి. చార్మినార్ పరిసరాల్లో మళ్లీ పూర్వవైభవం వచ్చేసింది.
చార్మినార్‌కు పూర్వవైభవం... కిటకిటలాడుతున్న పరిసరాలు
చార్మినార్ ప్రాంతాల్లో అమ్మే వస్తువుల కొనుగోలుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. 4 నెలలుగా వ్యాపారం లేక ఆర్థిక ఇబ్బందులతో రోజులు గడుపుతున్న వ్యాపారులకు ఈ అన్‌లాక్‌తో కొంత ఊరట దొరికినట్లయింది.