హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్‌సాగర్ నాలా పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడానికి హిదాయత్ పౌండేషన్ ముందుకు వచ్చింది. నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లోని కోదండరెడ్డినగర్ బస్తీ ప్రాంతానికి ప్రభుత్వ సాయం అందకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థల సహకారం - hyderabad katest news
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించడానికి ముందుకు వచ్చాయి. ఆహార పొట్లాలతో పాటు అవసరమైన సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నాయి.
వరద ముంపు ప్రాంత ప్రజలకు స్వచ్ఛంద సంస్థల సహకారం
ఆ ప్రాంత పరిస్థితి తెలిసిన హిదాయత్ పౌండేషన్ వ్యవస్థాపకుడు షాహిద్ 50 కుటుంబాలకు 300 ఆహార ప్యాకెట్లను అందజేశారు. తమ సంస్థ అన్ని వర్గాల ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేస్తుందని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తెలిపారు.