తెలంగాణ

telangana

ETV Bharat / city

లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: అక్బరుద్దీన్ - పాతబస్తీల ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యీ అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్​ పాతబస్తీలో ముంపునకు గురైన ప్రాంతాలను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్ధాలు అందించారు. భారీ వర్ష సూచన ఉన్నందున సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

chandrynagutta mla akbaruddin owaisi visit flood effected areas in oldcity
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: అక్బరుద్దీన్

By

Published : Oct 19, 2020, 6:29 PM IST


హైదరాబాద్ పాతబస్తీ ముంపునకు గురైన బాబా నగర్ , ఫుల్​బాగ్, గుల్షన్ ఇక్బాల్ కాలనీల్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. వర్షానికి నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.


బాదితులకు పాలు, బ్రెడ్, ఆహారం, నిత్యావసర వస్తువులను బాధితులకు అందించారు. ఈ రెండురోజుల్లా భారీ వర్ష సూచన ఉన్నందున... లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు, బంధువుల వద్దకు వెళ్లాలని సూచించారు.

ఇదీ చూడండి:పత్తి కొనుగోళ్లకు జిల్లాకో కాల్ సెంటర్: మంత్రి నిరంజన్​రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details