తెలంగాణ

telangana

ETV Bharat / city

పవన్​కల్యాణ్​కు చంద్రబాబు ఫోన్​.. ఆ విషయాలపై చర్చ.. - పవన్ పర్యటనపై ఆంక్షలు

CBN PHONE TO PAWAN KALYAN: జనసేన అధినేత పవన్​కల్యాణ్​కు నోటీసులు ఇవ్వడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ ఘటనపై పవన్ కల్యాణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్​ చేసి మాట్లాడారు. పోలీసు ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్‌తో చర్చించారు.

పవన్​కల్యాణ్​కు చంద్రబాబు ఫోన్​.. ఆ విషయాలపై చర్చ..
పవన్​కల్యాణ్​కు చంద్రబాబు ఫోన్​.. ఆ విషయాలపై చర్చ..

By

Published : Oct 16, 2022, 7:52 PM IST

CBN PHONE TO PAWAN KALYAN: ఏపీ విశాఖ ఘటనపై పవన్ కల్యాణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్​ చేసి మాట్లాడారు. పోలీసు ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్‌తో చర్చించారు. జనసేన నేతలపై కేసులను చంద్రబాబు తప్పుపట్టారు. పార్టీ అధ్యక్షుడికి ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు ఉందని చంద్రబాబు తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులు, నేతల అరెస్టు గురించి చంద్రబాబుకు పవన్​ వివరించారు.

అధికార పార్టీ.. పోలీసులతో పాలన చేయాలనుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సరికాదన్న చంద్రబాబు.. ప్రతిపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైకాపా పని చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వారి వారి కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని.. దాన్ని వైకాపా ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై మొదటి నుంచి ప్రభుత్వ విధానం ఇలాగే ఉంటుందని పవన్ కల్యాణ్​తో అన్నారు. పవన్​కు నోటీసులు ఇవ్వడం సరికాదన్న చంద్రబాబు.. పవన్ పర్యటనపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details