తెలంగాణ

telangana

ETV Bharat / city

చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా - Chandrayangutta Flyover Inauguration

Chandrayangutta Flyover Launch Postponed హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్​ ప్రారంభం వాయిదా పడింది. ఈ నెల 27న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.45.79 కోట్లతో 674 మీటర్ల పొడవుతో ఈ పైవంతెనను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విమానాశ్రయం, వరంగల్‌, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు 10 నిమిషాల సమయం ఆదా అవుతుంది.

Chandrayangutta Flyover
Chandrayangutta Flyover

By

Published : Aug 23, 2022, 9:19 AM IST

Updated : Aug 23, 2022, 12:00 PM IST

Chandrayangutta Flyover Launch Postponed: చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం వాయిదా పడింది. ఇక్కడి చౌరస్తాలోని ఒక కూడలిపై 2007లోనే పైవంతెనను ప్రారంభించారు. మరోవైపున్న బంగారుమైసమ్మ దేవాలయ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు పెరగడంతో పాత వంతెనను పొడిగించాలని బల్దియా నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ 2020లో శ్రీకారం చుట్టింది. పనులు తాజాగా పూర్తవడంతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఈ పైవంతెన ఉపయోగపడనుంది. 45 కోట్ల 79 లక్షల రూపాయల వ్యయంతో రెండు వైపుల 4 లైన్లతో... 674 మీటర్ల పొడవుతో ఫ్లైఓవర్ నిర్మించారు.

కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లిపోవచ్చు. ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు... ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు సకాలంలో చేరేందుకు వీలుకానుంది. ఎస్​ఆర్​డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ ఎంసీ 41 పనులు చేపట్టింది. చాంద్రాయణగుట్ట పైవంతెనతో ఇప్పటికే 30 పనులు పూర్తికాగా.. మరో 11 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు.. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం కోసం నగరంలో అవసరమైన చోట పైవంతెనలు, అండర్ పాస్​లు, ఆర్ఓబీలను.. ప్రభుత్వం దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది.

Last Updated : Aug 23, 2022, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details