తెలంగాణ

telangana

ETV Bharat / city

తెతెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం - Chandra babu blood donation campaign

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై నేతలతో చర్చించారు.

తెతెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం
తెతెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం

By

Published : Nov 30, 2019, 8:50 PM IST

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో టీఎస్​ఎన్​వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమై.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

తెతెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం

అరవింద్‌గౌడ్‌కు చంద్రబాబు పరామర్శ
ఇటీవల మాతృవియోగం కలిగిన తెతెదేపా సీనియర్‌ నేత అరవింద్‌ కుమార్‌గౌడ్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను చంద్రబాబు, ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్​ రెడ్డితోపాటు పలువురు నేతలు పరామర్శించారు.

ఇదీ చూడండి: చర్లపల్లి జైలుకు శంషాబాద్ నిందితులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details