'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరిట ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu) తలపెట్టిన 36 గంటల నిరసన దీక్షకు భారీగా స్పందన వచ్చింది. తొలిరోజు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు దీక్షకు అనుమతిస్తారా ! లేక ఛలో ఆత్మకూరు పర్యటన తరహాలో చంద్రబాబు ఇంటి గేటుకు మళ్లీ తాళ్లు కడతారా! అనే సందేహంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బుధవారం రాత్రే పెద్దఎత్తున అధినేత నివాసానికి చేరుకున్నారు. వారందరికీ చంద్రబాబు నివాసంలోనే వసతి ఏర్పాటు చేశారు.
తెలుగుతల్లి గీతాలాపనతో..
ఉదయం 8 గంటలకు చంద్రబాబు సభాస్థలికి చేరుకోవాల్సి ఉండగా...అదే మార్గంలో సీఎం పర్యటిస్తుండటంతో పోలీసులు ప్రతిపక్షనేత వాహన శ్రేణిని దారి మళ్లించారు. తాడేపల్లి మీదుగా రావాల్సిన వాహన శ్రేణి మంగళగిరికి వెళ్లి చుట్టూ తిరిగి వచ్చేసరికి 20 నిమిషాలు ఆలస్యమైంది. చంద్రబాబు వాహన శ్రేణి వెంట ఉన్న వాహనాలను పార్టీ కార్యాలయం సర్వీసు రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేతలు స్వాగతం పలికి దీక్షాస్థలికి తీసుకెళ్లారు. మా తెలుగుతల్లి గీతాలాపనతో దీక్షాస్థలిపై చంద్రబాబు నిరసన ప్రారంభించారు.
ఆంక్షల కారణంగా..