ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంపై ప్రతిపక్షాలు ఆందోళన ఉద్ధృతం చేశాయి. ఇప్పటికే తెదేపా, భాజపాలతో పాటు హిందూ సంఘాలు సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
నేడు రామతీర్థం సందర్శనకు తెదేపా అధినేత - విజయనగరం జిల్లా తాజా వార్తలు
ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములోరి విగ్రహ ధ్వంసంపై ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెదేపా అధినేత చంద్రబాబు నేడు రామతీర్థంలోని ఆలయాన్ని సందర్శించనున్నారు.
నేడు రామతీర్థం సందర్శనకు చంద్రబాబు
ఇవాళ ఉదయం విజయవాడ నుంచి విశాఖకు విమానంలో వెళ్లనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.30 గంటలకు రామతీర్థం చేరుకుంటారు. కాలినడకన కొండపైకి వెళ్లి ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలిస్తారు. అనంతరం నిరసన తెలియజేయనున్నారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణానికి కారణమైతే పదేళ్ల జైలు!