తెలంగాణ

telangana

ETV Bharat / city

Nara Bhuvaneswari reacts to AP Assembly Incident : 'నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు' - Kodali nani reacts to chandrababu comments

Nara Bhuvaneswari, నారా భువనేశ్వరి, ఏపీ అసెంబ్లీలో వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి రియాక్షన్
నారా భువనేశ్వరి

By

Published : Nov 26, 2021, 11:57 AM IST

Updated : Nov 26, 2021, 3:00 PM IST

14:57 November 26

నాకు అండగా నిలిచిన వారిని ఎన్నటికీ మరవను : నారా భువనేశ్వరి

నాకు అండగా నిలిచిన వారిని ఎన్నటికీ మరవను : నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari reacts to AP Assembly Incident  : ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదని అన్నారు. కష్టాల్లో తనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని ఆశిస్తున్నాను’’.

  - నారా భువనేశ్వరి, చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ

11:54 November 26

నాకు అండగా నిలిచిన వారిని ఎన్నటికీ మరవను : నారా భువనేశ్వరి

ఏపీ అసెంబ్లీలో వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి ప్రకటన

Chandrababu cries in Press meet: ఇటీవలే.... ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు.. ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాటలు తడబడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు.... కష్టనష్టాల్లో తోడుగా నిలిచిన సతీమణిని అనరాని మాటలు అన్నారంటూ తీవ్రంగా ఆవేదన చెందారు. ఇలాంటి అవమానం తట్టుకోలేనంటూ వెక్కివెక్కి ఏడ్చారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Nandamuri family stands with Chandrababu : ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు.  వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Kodali Nani Comments on Chandrababu : మరోవైపు ఈ ఘటనపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ బయట కానీ వైకాపా నేతలు ఎక్కడా తీసుకురాలేదని స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవమేనన్న నాని.. సీఎం జగన్​ కూడా వారిని గౌరవిస్తారని అన్నారు. తన భార్యను ఏదో అన్నారని సాకులు చెబుతూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని.. చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ బయట కానీ వైకాపా నేతలు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఆమె పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు విడిచి పెట్టి తన సొంత విషయాలు బాధితులకు ఏకరువు పెట్టడం ఏంటని నాని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Nov 26, 2021, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details