గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సీతక్క తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. సీతక్కతో మాట్లాడారు. ఆమె మాతృమూర్తి సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని.. ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలుగా బయటపడతారంటూ చంద్రబాబు.. సీతక్కకు ధైర్యం చెప్పారు.
ఆ ఎమ్మెల్యేను పరామర్శించిన చంద్రబాబు - mulugu mla news
ఆ నాయకుడి అడుగు జాడల్లో ఆమె చాలా రోజుల పాటు నడిచింది. ఆయన కలలు సాకారం చేసేందుకు నిరంతరం శ్రమించింది. పగలు రాత్రీ తేడా లేకుండా పనిచేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఓ జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకొంది. అయిన తన రాజకీయ గురువుపై ఇప్పటికీ ఆమెకు ఎనలేని అభిమానం.. వేదికేదైనా.. ఏ అవకాశం వచ్చినా.. నా అన్నంటూ ఆయనను గుర్తుచేసుకుంటుంది.. ఆ అన్నాచెల్లెళ్లే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ములుగు ఎమ్మెల్యే సీతక్క..
ఆ ఎమ్మెల్యేను పరామర్శించిన చంద్రబాబు