వైకాపా ఆందోళన.. నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు - విశాఖలో పరిస్థితి ఉద్రిక్తం
వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖ ఉడుకుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పరిస్థితి రణరంగమైంది. వేలాదిగా తరలివచ్చిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి... కొన్ని గంటలుగా చంద్రబాబు వాహనశ్రేణి ముందుకు కదలకుండా స్తంభింపజేశారు. ఈ క్రమంలో వాహనం దిగి నడుస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. తెదేపా, వైకాపా కార్యకర్తల పోటాపోటీ నినాదాల మధ్య తోపులాట నెలకొంది. తర్వాత భద్రతా కారణాల రీత్యా.. పోలీసుల విజ్ఞప్తి మేరకు బాబు వాహనంపై వెళ్లారు.
వైకాపా ఆందోళన.. నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు
.
Last Updated : Feb 27, 2020, 1:25 PM IST