ఉన్మాదుల పాలన ఎలా ఉంటుందో జగన్ తీరే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అండ ఉందనే అహంతో నేరగాళ్ల కళ్లు నెత్తికెక్కి.. ఎస్సీలపై వరుసగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా తెదేపా నాయకులు, ఎస్సీ సంఘాల నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎస్సీలపై హత్యలు, శిరోముండనాలు, గ్యాంగ్ రేప్‌లు, బెదిరింపులు, వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి భూమిని ఆక్రమించడాన్ని ఆయన ఖండించారు. ఏపీలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదన్న చంద్రబాబు.. తొలిదాడి జరిగినప్పుడే కఠినంగా శిక్షిస్తే ఈ వరుస ఘటనలు జరిగేవా అని నిలదీశారు. రెండు నెలల్లో రెండు జిల్లాల్లో ఇద్దరు ఎస్సీ యువకులకు శిరోముండనాలాపై ప్రశ్నించారు.