అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దేశచరిత్రలో తొలిసారి ఐఏఎస్‌కు ఎంపికైన అంధ మహిళ ప్రాంజల్ పాటిల్‌ను కొనియాడారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాలలో ముందుకు వెళ్లేలా కృషి చేయాలని ఆయన అన్నారు. దివ్యాంగులు కూడా అవకాశాలను అందిపుచ్చుకొని పలురంగాల్లో ప్రతిభ కనబరుస్తూ, లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ఎవరికీ తక్కువ కాదని చాటుతున్నారని అన్నారు. వారి పురోభివృద్ధికి ఏపీ ప్రభుత్వ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి: చంద్రబాబు - అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కు, భద్రత, గౌరవం అందుకునేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దివ్యాంగులకు అండగా ఉండాలని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకెళ్లాలి: చంద్రబాబు