తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu: ఎవరూ అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: చంద్రబాబు

తిరుపతిలో చంద్రబాబు(chandrababu) పర్యటన కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఎవరూ అధైర్యపడవద్దని... తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Chandrababu: ఎవరూ అధైర్యపడవద్దు..అండగా ఉంటాం: చంద్రబాబు
Chandrababu: ఎవరూ అధైర్యపడవద్దు..అండగా ఉంటాం: చంద్రబాబు

By

Published : Nov 24, 2021, 1:35 PM IST

Updated : Nov 24, 2021, 1:43 PM IST

ఏపీలో చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు (chandrababu tour in chittoor district) పర్యటిస్తున్నారు. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా.. ప్రభుత్వం ఏం చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం కలిగేదా ? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దు.. తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. ఈ సీఎం గాలిలో తిరుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు చంద్రబాబు తిరుపతిలోని రేణి వై కన్వెన్షన్ సెంటర్​లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌(photo exhibition)ను పరిశీలించారు. వరద తీవ్రతను తెలియజేసే చిత్రాలతో తెదేపా నేతలు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాక దృష్ట్యా తిరుపతి రేణి వై కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా తెదేపా నేతలు తరలివచ్చారు.

మంగళవారం పర్యటన

కడప జిల్లా రాజంపేట, నందలూరు మండలాల్లో వరద బీభత్సానికి దెబ్బతిన్న గ్రామాలను, వరదల్లో మృత్యువాత పడిన బాధిత కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉదయం కడప విమానాశ్రయం(TDP chief Chandrababu visited ) నుంచి ప్రారంభమైన చంద్రబాబు పర్యటన.. రాత్రి 9 గంటల వరకు సాగింది. కడప విమానాశ్రయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన వెళ్లి రాజంపేట మండలం మందపల్లె, పులపుత్తూరు, గుండ్లూరు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో అధికారికంగా ఇప్పటివరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. మందపల్లెలో ఒకే కుటుంబంలో ఏడుగురు మృత్యువాత పడగా.. బాధిత కుటుంబం ఇంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ... చెయ్యేరు నది ఉద్ధృతికి గురైన పంటలను పరిశీలించారు. నది ఒడ్డునే ఊరు ఉండటం.. ప్రవాహానికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఇదీ చదవండి

Chandrababu Tour: వరద బాధితులకు చంద్రబాబు భరోసా.. నేడు చిత్తూరులో పర్యటన

Last Updated : Nov 24, 2021, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details