తెలంగాణ

telangana

ETV Bharat / city

సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు - టీడీపీ న్యూస్​

సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంఛార్జీలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు.. పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు
సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు

By

Published : Sep 24, 2022, 9:43 AM IST

పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పని తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నియోజకవర్గ ఇంఛార్జ్​లు నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 59 మంది ఇంఛార్జ్​లతో చంద్రబాబు ముఖాముఖి భేటీ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ ఇంఛార్జ్‌లను.. చంద్రబాబు ప్రశ్నించారు.

ఇంఛార్జీలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు.. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అంతర్గత నివేదికల ఆధారంగా నేతల పనితీరును విశ్లేషించి.. బాగా పనిచేస్తున్న వారిని అభినందించారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బాదుడే బాదుడు వరకూ.. అన్ని అంశాలపై సమీక్షించారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్‌ ప్రభుత్వంపై ఉందన్న ఆయన.. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని ఘాటుగా హెచ్చరించారు. సమీక్షలను నేతలు సీరియస్‌గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని తేల్చిచెప్పారు. అంతిమంగా పనితీరే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details