CHANDRABABU: వైకాపా ప్రభుత్వం వచ్చాక విశాఖలో వరస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల మరణాలు సాధారణమయ్యాయని విమర్శించారు. ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందని.. ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'కమిటీలు వేసి చేతులు దులుపుకోవటం కాదు.. ఆ పని చేయండి..' - ఏపీ తాజా వార్తలు
CHANDRABABU: ఏపీలోని అచ్యుతాపురం సెజ్ పరిశ్రమ ప్రమాద ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మొదలుకుని.. పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైపోయిందని ఆరోపించారు.
chandrababu-respond-on-atchutapuram-sez-incident