తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu Comments on Jagan : 'ప్రేమ్​చంద్రారెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు?' - Chandrababu on OTS scheme

Chandrababu Comments on Jagan : నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లింపుల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు.. సన్నిహితుడైన ప్రేమ్‌చంద్రారెడ్డిని సీఐడీ ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షి సంతకం చేసినవారిపై అక్రమ కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని మండిపడ్డారు.

chandrababu, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు

By

Published : Dec 14, 2021, 8:17 AM IST

Chandrababu Comments on Jagan : నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లింపుల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు.. సన్నిహితుడైన ప్రేమ్‌చంద్రారెడ్డిని సీఐడీ ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. సాక్షి సంతకం చేసినవారిపై అక్రమ కేసులు పెట్టడం అధికార దుర్వినియోగమేనని మండిపడ్డారు. ఈ నెల 17న తిరుపతిలో జరగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని నిర్ణయించారు. ఓటీఎస్​కు వ్యతిరేకంగా.. ఈ నెల 20, 23 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు.

Chandrababu on Premchandra reddy : పార్టీ ముఖ్యనేతలతో .. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్‌ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. కక్ష సాధింపు కోసమే.. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత, సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే.. ఏపీఎస్ఎస్​డీసీ పై విచారణ అంటున్నారని ధ్వజమెత్తారు. నిజాయతీపరుడైన లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకుని.. తెలుగుదేశంపై బురద చల్లేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్‌చంద్రారెడ్డిని సీఐడీ ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. ఏపీఎస్ఎస్​డీసీ ఎండీ, సీఈవో హోదాలో.. చెల్లింపులు జరిపింది ప్రేమ్‌చంద్రారెడ్డేనని.. ముందుగా ప్రశ్నించాల్సింది ఆయన్నే అని చంద్రబాబు అన్నారు.

Chandrababu on OTS : ఓటీఎస్ పథకం ప్రజలకు ఉరితాళ్లుగా మారిందని.. పేదల జీవితాలతో జగన్‌ ఆడుకుంటున్నారని.. తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఇళ్లపై పేదలకు ఉచితంగా హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో.. ఈ నెల 20న మండల, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, 23న కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారని సమావేశంలో తీర్మానించారు. ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని తెలిపారు.

Chandrababu Fires on Jagan : పోలీసుల్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. జగన్‌ క్రూరంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లతో పోరాడాల్సి వస్తోందన్నారు. సవాళ్లకు అనుగుణంగా కేడర్‌ను, నాయకుల్ని సమర్థంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల్ని, వరద బాధితుల్ని, గుత్తేదారుల్ని జగన్ విస్మరించారని మండిపడ్డారు. ఈ నెల 17న తిరుపతిలో జరిగే అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు కార్యక్రమానికి మద్దతు తెలపాలని తెలుగుదేశం నిర్ణయించింది. పాదయాత్రకు సంఘీభావంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని.. సమావేశంలో తీర్మానించారు.

కష్టంలో ఉన్న చిరకాల మిత్రుడైన లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై.. కేసు నమోదు చేయడం.. మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు.. మీడియాపై దాడిగా.. తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ఠ అంటూ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details