యడ్లపాటి వెంకట్రావు ప్రారంభించిన సంగం డెయిరీని వీరయ్య చౌదరి ఎంతో అభివృద్ధి చేశారని చంద్రబాబు అన్నారు. అమూల్ కోసం పాడిరైతులకు ప్రయోజనం చేకూర్చే డెయిరీని నిర్వీర్యం చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశంపై అరెస్ట్ ఎలా చేస్తారని తెదేపా అధినేత మండిపడ్డారు. వీలైతే నాలుగు మంచి పనులు చేయాలి కానీ రైతులకు చెడు చేయటం తగదని హితవు పలికారు.
కక్ష సాధింపులకు సమయమా?
రాష్ట్రం తగలపడుతుంటే ధూళిపాళ్ల నరేంద్ర, పల్లా శ్రీనివాస్‌లపై కక్ష సాధింపులకు సమయమా? అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో.. అప్పుడే రాష్ట్రానికి అరిష్టం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి బతికుంటేనే.. రాజకీయమైనా, మరేదైనా అని హితవు పలికారు.