వైకాపా పాలనలో ఏపీలో నగరాలు పతనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖలో తెదేపా నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సులభతర జీవన సూచీ ర్యాంకుల్లో తిరుపతి స్థానం 4 నుంచి 46కు పడిపోవడం బాధాకరమన్నారు. విజయవాడ 9 నుంచి 41వ ర్యాంకుకు పడిపోయిందన్నారు.
వైకాపా పాలనలో నగరాలు పతనం: చంద్రబాబు - ఏపీ వార్తలు
వైకాపా పాలనలో ఏపీలో నగరాలు పతనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సులభతర జీవన సూచీ ర్యాంకులే నిదర్శనమన్నారు. ర్యాంకుల పతనం పురపాలికల పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆక్షేపించారు.
వైకాపా పాలనలో నగరాలు పతనం: చంద్రబాబు
ర్యాంకుల పతనం పురపాలికల పరిస్థితికి అద్దం పడుతోందని ఆక్షేపించారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.