తెలంగాణ

telangana

ETV Bharat / city

నాడు దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్ట్ జీనోమ్ వ్యాలీ: చంద్రబాబు

కొవిడ్ వ్యాక్సిన్​పై భారత్ బయోటెక్ చేస్తున్న ప్రయత్నాలన్ని విజయవంతం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. నాడు తెదేపా హయాంలో చేపట్టిన ప్రత్యేక జీనోమ్ వ్యాలీ... నేడు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో ముందు వరుసలో నిలిచిందని ట్వీట్ చేశారు.

chandrababu-on-bharat-biotech-vaccine-clinical-trials
నాడు దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్ట్ జీనోమ్ వ్యాలీ: చంద్రబాబు

By

Published : Nov 27, 2020, 9:32 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ విధానాలు భవిష్యత్తు రుజువులని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి సమీక్షకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్​లోని జినోమ్ వ్యాలీ సందర్శనపై చంద్రబాబు ట్విట్టర్​లో స్పందించారు.

"బయోటెక్ గురించి ఎక్కడా వినిపించని 90వ దశకంలో తెదేపా ప్రభుత్వం అంకితభావంతో నిర్మించిన ప్రత్యేక పార్క్ జినోమ్ వ్యాలీ. ఎంతో దూరదృష్టితో చేపట్టిన ఈ ప్రాజెక్టు నేడు కొవిడ్​కు వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచింది. దేశంలోని 150కిపైగా ఉన్న లైఫ్ సైన్స్ క్లస్టర్లలో ఇది మొదటిది. ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనల సాక్షాత్కారానికి ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది. లైఫ్ సైన్స్ స్పెక్ట్రంలో ఉత్తమ ప్రతిభను కనబరిచింది. జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా ఈ వాస్తవాన్ని రుజువు చేసింది. భారత్ బయోటెక్ లోని ప్రతిభావంతులకు, కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలన్నింటికీ నా అభినందనలు. వీళ్లు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా." అని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైంది: జేపీ నడ్డా

ABOUT THE AUTHOR

...view details