ఏపీ రాజధానిపై బీసీజీ ఇచ్చిన నివేదిక అసత్యాల పుట్ట అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బీసీజీ నివేదిక ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీజీకి విశ్వసనీయత లేదని.. ఆ నివేదిక చెత్త కాగితమన్నారు. శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పిందని.. దాని ఆధారంగా తీసుకున్న నిర్ణయం మార్చడానికి వారెవరని మండిపడ్డారు. సీఎం జగన్ సహా ఇతర వైకాపా నేతల స్పందనల వీడియోలు ప్రదర్శించారు. అజేయ కల్లం చెబితే జీఎన్ రావు.. విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెప్పినదానికి అనుగుణంగా బీసీజీ.. నివేదికలు ఇచ్చాయన్నారు. ఎవర్ని మోసం చేయటానికి మరో హైపవర్ కమిటీ వేశారని ధ్వజమెత్తారు.
జిల్లాల వారీగా అభివృద్ధి చేశాం