మహానాడులో చంద్రబాబు ప్రసంగం ChandraBabu at Mahanadu 2022 : తెదేపాకు కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నూతనోత్సాహంతో ఉండేవాళ్లను ఎంపిక చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో మండువవారిపాలెం వద్ద ఘనంగా ఏర్పాటు చేసిన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
హైదరాబాద్‌లో ఎంతో అభివృద్ధి చేశాం ChandraBabu at Mahanadu in Ongole : మహానాడులో మొత్తం 17 తీర్మానాలను తెదేపా ప్రవేశపెట్టింది. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై భారాలకు సంబంధించి 12 తీర్మానాలు.. ఏపీకి 12, తెలంగాణకు 3, రాజకీయ తీర్మానం 1, అండమాన్‌కు ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. క్విట్ జగన్. సేవ్ అంధ్రప్రదేశ్ నినాదం తీసుకొస్తున్నాని చంద్రబాబు అన్నారు. జగన్ దిగిపోతే తప్ప ఏపీకి మంచి రోజులు రావని తెలిపారు. జగన్ అండ్ కంపెనీ ఆదాయం పెరిగిందని.. ప్రజల ఆదాయం మాత్రం తగ్గిందని తెలిపారు. క్విట్ జగన్...సేవ్ ఏపీ నినాదం ప్రతి ఇంట్లో వినిపించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ChandraBabu at 40th Mahanadu : అభివృద్ధి చేయడం చేతకాని వైకాపా ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని పాలన సాగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఉన్మాది చేతిలో పోలీసులు బలికావద్దంటూ చంద్రబాబు సూచించారు. తప్పుడు పనులు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
"మనం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టాం. గడప గడపకు ప్రభుత్వం అని వాళ్లు మరో కార్యక్రమం పెట్టారు. ప్రజల నుంచి స్పందన లేక బస్సు యాత్ర మొదలుపెట్టారు. సామాజిక న్యాయమని గొప్పలు చెప్పుకొని రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగ పట్టుకుంటే ఏమవుతుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారు. సీఎం పదవి నాకు కొత్త కాదు. ఎక్కువ సమయం సీఎంగా ఉండే అవకాశమిచ్చారు. నా ఆవేదన, బాధ అంతా రాష్ట్రం నాశనమైంది. రాష్ట్ర ప్రజలంతా బాధల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది." -- మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
ఐఎస్‌బీ-20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ తన కృషిని గుర్తించకపోయినా.. దాన్ని తీసుకురావటంలో చేసిన కృషి ఎంతో తృప్తినిస్తుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌కు అలాంటి అత్యున్నత సంస్థలు, అభివృద్ది కార్యక్రమాలు చాలా చేశామని తెలిపారు. ఆ సంస్థల్లో రైతు, రైతు కూలీల కుటుంబాల్లోని పిల్లలు చదివి ఎంతో ఉన్నతస్థానానికి చేరుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.