తెలంగాణ

telangana

ETV Bharat / city

డిజిటల్ మహానాడు-2020పై బాబు ట్వీట్​ - chandrababu naidu tweet on digital mahanadu 2020

అసంఖ్యాక జనసందోహంలో జరిగే మహానాడు వేడుక... కరోనా కారణంగా డిజిటల్ మహానాడుగా మారిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహానాడు నిర్వహించుకునేందుకు అవకాశం లభించిందన్నారు. డిజిటల్ మహానాడు దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ సమావేశంగా నిలుస్తుందన్న చంద్రబాబు.... తెలుగు తమ్ములందరూ మహానాడులో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

chandrababu naidu tweet on digital mahanadu 2020
డిజిటల్ మహానాడు-2020పై బాబు ట్వీట్​

By

Published : May 27, 2020, 4:28 PM IST

ఏ సమస్యకైనా సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. లాక్‌డౌన్‌లో భౌతికదూరం పాటిస్తూనే డిజిటల్‌ సోషలైజేషన్‌ దిశగా అడుగులేద్దామన్నారు. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు-2020 కూడా అటువంటిదేనని చంద్రబాబు అన్నారు. ఏటా అసంఖ్యాక జనసందోహం మధ్య జరిగే మహానాడు వేడుక .. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల డిజిటల్ మహానాడుగా మారిందన్నారు. ఈ వేడుక చేసుకునేందుకు జూమ్‌ వెబినార్‌ సాంకేతికత ఓ మార్గం చూపిందన్నారు.

మహానాడు- 2020.. దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ సమావేశంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలంతా డిజిటల్‌ మహానాడులో పాల్గొనాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు.

డిజిటల్ మహానాడు-2020పై బాబు ట్వీట్​

ఇదీ చదవండి :భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్​ బుల్లెట్లు'

ABOUT THE AUTHOR

...view details