మీడియాకు సంకెళ్లు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియాపై 2430 జీవో తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్న చంద్రబాబు... ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరూ నాశనం చేయలేరని చెప్పారు. 2430 జీవో రద్దుచేసి, నిషేధం ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
'పత్రికా స్వేచ్ఛను కాపాడేవరకు పోరాటం చేస్తాం' - babu on channels ban in assembly
జీవో 2430 రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఫైర్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు. ఏపీ అసెంబ్లీలో కొన్ని ఛానళ్ల నిరాకరణపై చంద్రబాబు నేతృత్వంలో తెదేపా ఆందోళన చేసింది. నోరు, చేతులు, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నేతలు నిరసన వ్యక్తం చేశారు.
'పత్రికా స్వేచ్ఛను కాపాడేవరకు పోరాటం చేస్తాం'