తెలంగాణ

telangana

ETV Bharat / city

మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు - తిరుపతి తెదేపా కార్యాలయంలో ఉగాది వేడుకలు

సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉగాది పంచాగ శ్రవణంలో పాల్గొన్న ఆయన.. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఏడాది నెలకొన్న చీకట్లను ఈ కొత్త సంవత్సరంలో అధిగమించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రచారంలో రాళ్ల దాడి ఘటనపై మాట్లాడిన చంద్రబాబు.. మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా..? అని వ్యాఖ్యానించారు.

cbn
మందుపాతరకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

By

Published : Apr 13, 2021, 2:43 PM IST

తిరుపతి తెదేపా కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. గతేడాది నెలకొన్న చీకట్లు అందరూ అనుభవించారని.. ఈ ప్లవ నామ సంవత్సరంలో వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలని ఆకాంక్షించారు. తిరుపతి ప్రచారంలో జరిగిన ఘటన అందరికీ తెలుసన్న ఆయన.. సమస్యలకు భయపడకుడా, ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఏదీ శాశ్వతం కాదనేది తిరుపతి ఎన్నికల ఫలితాలతోనే నిరూపితమవుతుందని వ్యాఖ్యానించారు.

ఉగాది తొలి రోజు మంచి సంకల్పం చేద్దాం. తెదేపాకు తిరుపతి కంచుకోట. 1983 నుంచి ఎక్కువసార్లు తెదేపాదే విజయం. తిరుపతి అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమైంది. తిరుమల పవిత్రతను కాపాడాం. తిరుపతిలో నా సభపై రాళ్లు వేస్తారా..? మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా.? తిరుపతిలో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడితే తిరుమలపైనా ప్రభావం ఉంటుంది. చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెదేపాపై వైకాపా దాడులు చేస్తోంది.

- చంద్రబాబు, తెదేపా అధినేత

మందుపాతరకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

ఇవీచూడండి:తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details