ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 18న ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కేసుల మాఫీ కోసమే విశాఖ ఉక్కును ఏపీ ముఖ్యమంత్రి జగన్... ప్రైవేటు పరం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై 18న ఏపీ వ్యాప్తంగా నిరసనలు' - tdp on visakha steel plant news update
తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు ఏపీ సీఎం జగన్ కుట్రలు సాగవన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 18న ఏపీ వ్యాప్త ఆందోళనలు చేయాలని తెదేపా నేతలకు పిలుపునిచ్చారు. ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై 18న ఏపీ వ్యాప్తంగా నిరసనలు
పోస్కోతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించిన ఆయన... స్టీల్‌ప్లాంట్ మిగులు భూములను కాజేసేందుకు కేంద్రం ముందు మోకరిల్లారని విమర్శించారు. ప్రైవేటీకరణకు బాటలు వేసి ప్లాంటునే నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో తెదేపా ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు.
- ఇవీ చూడండి :ఉడుకుతున్న 'ఉక్కు' నగరం