ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. 41వ డివిజన్లో దర్గా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం గెలుపు కోసం దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నుంచి సితార సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.
'అమరావతి పరిరక్షణ కోసం ఇంటికొకరు పోరాటానికి రావాలి' - విజయవాడలో చంద్రబాబు పర్యటన వార్తలు
అమరావతి ఆంధ్రుల హక్కు అని.. రాజధాని పరిరక్షణ కోసం అందరూ పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి కోసం విజయవాడలో ఇంటికొకరు రావాలని కోరారు. విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అమరావతి కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.
రాజధాని పరిరక్షణ కోసం అందరూ పోరాడాలి: తెదేపా అధినేత
అమరావతి కోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రి వెల్లంపల్లికి దుర్గమ్మపైనా భయం, భక్తి లేదని విమర్శించారు. విజయవాడలో తెదేపా గెలవకుంటే మీరు తలెత్తుకు తిరగలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరస్థులు, గూండాల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని విమర్శించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఈ నీళ్లు తాగితే కరోనా దరిచేరదట...!