ఏపీలోని నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో వైకాపా నేతలు మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు కొడవళూరు మండలం కమ్మపలేం గ్రామానికి చెందిన కరాకట మల్లికార్జున్ పై నలుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొడవలూరు పోలీసులు మల్లికార్జున్ పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటంతో పాటు... అతనిపైనే రౌడీ షీట్ తెరిచారని తప్పుబడుతూ ఆ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఒక ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఇలా చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు.
దాడికి గురైన వారిపైనే అక్రమ కేసులు పెట్టారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ - తెదేపా అధినేత చంద్రబాబు న్యూస్
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమ కేసులు పెట్టారని ఆ లేఖలో పేర్కొన్నారు. మల్లికార్జున్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించి వీడియోను లేఖకు జత చేశారు.
పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేని విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. అసలు నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుని మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మల్లికార్జున్‌ను తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన కొడవళూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్‌పై దాడికి సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు లేఖకు జత చేశారు.
ఇదీ చదవండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్ అవసరమా ?