తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపా చేసిన అభివృద్ధిని యువతకు వివరించండి: చంద్రబాబు - ఎన్టీఆర్​ భవన్ తాజా సమాచారం

Chandrababu: తెలంగాణలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత యువతరానికి వివరించి పార్టీ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర ముఖ్య నేతలతో శనివారం సమీక్ష నిర్వహించారు. రంజాన్‌ సందర్భంగా ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

chandrababu
చంద్రబాబు

By

Published : May 1, 2022, 8:25 AM IST

Chandrababu: తెదేపా పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత యువతరానికి వివరించి తెలంగాణలో వారు పార్టీ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్య నేతలతో శనివారం సాయంత్రం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన సమీక్ష జరిపారు. ఏపీలో అభివృద్ధి లేక నరకంలా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్‌ నిర్మాణం తెదేపా హయాంలోనే జరిగింది. విభజన తరవాత ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ అభివృద్ధికి బాటలు వేశాం. జగన్‌ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని ఆపేయడంతో ఏపీ వెనుకబడింది’’ అని చెప్పారు.

‘‘గతంలో 7 లక్షల సభ్యత్వాలను చేశారు. ఈసారి మరిన్ని నమోదు చేయించాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు ఈ సమావేశానికి రాలేదు. ఆయన రాలేదని అపోహలు వద్దు. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు’’ అని చంద్రబాబు చెప్పారు. రంజాన్‌ సందర్భంగా చంద్రబాబు ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పలువురు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details