తెలంగాణ

telangana

ETV Bharat / city

కుప్పంలో దాడుల సంస్కృతి దురదృష్టకరం: చంద్రబాబు - కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చింది

CBN FIRE: ఏపీలోని కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని ఆయన ఖండించారు.

కుప్పంలో దాడుల సంస్కృతి దురదృష్టకరం: చంద్రబాబు
కుప్పంలో దాడుల సంస్కృతి దురదృష్టకరం: చంద్రబాబు

By

Published : May 16, 2022, 12:33 PM IST

CBN FIRE: ఆంధ్రప్రదేశ్​లోని కుప్పంలో ఓ హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. కుప్పంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని వైకాపా తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. భోజనం అయిపోయిందని చెప్పిన హోటల్‌ సిబ్బందిపై.. వైకాపా నాయకులు దాడి చేయడం దారుణమన్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి మహిళలను బెదిరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

"హోటల్ తగలబెడతాం, నిర్వాహకులను చంపేస్తాం అంటూ బెదిరిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు" అని చంద్రబాబు నిలదీశారు. కఠిన చర్యలతో క్రిమినల్ కార్యకలాపాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని ట్విట్టర్​ వేదికగా భరోసా ఇచ్చారు.

అసలేమైందంటే..: కుప్పం పట్టణం బైపాస్‌ మార్గంలోని ఓ దాబాలో వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..:

హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఇలా..!!

చనిపోయిందని శ్మశానానికి చిన్నారి.. చివరి క్షణంలో లక్కీగా..

ABOUT THE AUTHOR

...view details