తెలంగాణ

telangana

ETV Bharat / city

CBN Fire On YSRCP: ఉగ్రవాదులను మించిన పాలన వైకాపాది: చంద్రబాబు

ఏపీలో సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసి వాలంటీర్లను అందలం ఎక్కించారని తెదేపా అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. పంచాయతీలకు చెందిన ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులను చట్టవిరుద్ధంగా దారి మళ్లించారని..ఆ నిధులు తిరిగొచ్చేవరకు తెదేపా న్యాయ పోరాటం చేస్తుందని అన్నారు. వైకాపాది ఉగ్రవాదులను మించిన పాలన అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu-fire-on-ysrcp-govt
chandrababu-fire-on-ysrcp-govt

By

Published : Feb 17, 2022, 3:35 PM IST

ఉగ్రవాదులను మించిన పాలన వైకాపాది అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏపీలో సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని.. హక్కుల కోసం వారు చేసే పోరాటానికి తెదేపా మద్దతిస్తుందని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపాకు చెందిన రాయలసీమ ప్రాంత జిల్లాల సర్పంచ్‌ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

"గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. వైకాపా ప్రభుత్వం సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. సర్పంచులకు రాజ్యాంగం అధికారాలను ఇచ్చింది. రాజ్యాంగ హక్కులను జగన్‌ హరిస్తున్నారు. సర్పంచుల అధికారాలను తీసుకోవడానికి ఆయన ఎవరు ? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం చేయకుండా కూడా చేశారు. అయినా.. తెదేపా తరఫున బరిలో దిగి పోరాడి గెలిచారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

అన్నా.. అంటూనే పదవి ఊడగొట్టారు!
మాజీ సీఎస్​ సుబ్రహ్మణ్యంను "అన్నా" అంటూ శుభ్రంగా బాపట్ల పంపారని.. ఇప్పుడు గౌతమ్ సవాంగ్​ను కూడా "అన్నా" అంటూనే డీజీపీ పదవి నుంచి పీకేశారని ముఖ్యమంత్రి జగన్​పై చంద్రబాబు వ్యంగ్యస్త్రాలు సంధించారు.

అధికారుల్లో వస్తున్న వ్యతిరేకత గమనించే సవాంగ్​కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో గంజాయి లేదని బుకాయించిన ప్రభుత్వం.. డీజీపీ చేతనే రూ.300 కోట్ల విలువైన గంజాయిని తగులబెట్టించిందన్నారు. సర్పంచ్​లకు ఉన్న పరిజ్ఞానం కూడా సీఎం జగన్​కు లేదని చంద్రబాబు విమర్శించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details