cbn nellore tour: ఏపీలోని నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, వెంకటాచలం వద్ద ఆగి శ్రేణులతో కాసేపు మాట్లాడారు. మద్యపాన నిషేధమని చెప్పిన సీఎం జగన్.. తాగిన డబ్బుతో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇవ్వటమేంటని ప్రశ్నించారు.
నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి, మీరు తాగితే మీ పిల్లలకి చదువు అని కొత్త కొత్త స్కీములు పెట్టే విచిత్రమైన మనిషి జగన్(babu fire on jagan) అని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో కొత్త కష్టాలు ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలన్నారు. పేదవాడి రక్తాన్ని తాగే జలగ వైకాపా అని ధ్వజమెత్తారు. తాను ప్రజల కోసం ఉన్నానని.. బెదిరింపులకు భయపడబోనని తేల్చిచెప్పారు.