తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోలీసులను అడ్డుపెట్టుకొని పాదయాత్రను తొక్కేస్తున్నారు'

ఏపీలో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై పోలీసులను అడ్దుపెట్టుకుని ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా ఓర్వలేకపోతోందని మండిపడ్డారు.

chandrababu-fire-on-ycp-govt-over-farmers-padayatra
chandrababu-fire-on-ycp-govt-over-farmers-padayatra

By

Published : Nov 7, 2021, 4:37 PM IST

ఏపీలో అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా ఓర్వలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలీసులను అడ్దుపెట్టుకుని పాదయాత్రపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చినా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించటం హేయమైన చర్య అని మండిపడ్డారు. పాదయాత్రను కొవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు.

జగన్ ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తైనందని నిన్న వైకాపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, బహిరంగ సభలు పెట్టారని..,వారికి కరోనా నిబంధనలు వర్తించవా ? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో పోలీసుల్ని అడ్డుపెట్టుకొని జగన్ ప్రజలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టారన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకునుగుణంగా రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని చంద్రబాబు హితవు పలికారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details