Chandrababu Fire: గతంలో సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్న ఏపీ... ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పులు తీర్చేందుకు ప్రజల నుంచి విచ్చలవిడిగా పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పథకాల పేరిట 10 శాతం ఇస్తూ.. ప్రజల నుంచి 90 శాతం దోచేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పన్నులు, విద్యుత్ ఛార్జీ మోత తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్ష రూపాయలకు పైగా భారం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైకాపా పాలనపై ప్రజలంతా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
"గతంలో సంక్షేమాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం సంక్షోభం దిశగా పయనిస్తోంది. పన్ను, విద్యుత్ ఛార్జీలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. వైకాపా బాదుడే బాదుడు విధానంతో అల్లాడుతున్నారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్షకుపైగా భారం పడుతోంది. చేసిన అప్పులు తీర్చేందుకు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. పథకాల మాటున 10 శాతం ఇచ్చి 90 శాతం దోచేస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైకాపా పాలనపై ప్రజలంతా పోరాడాలి."