ఏపీలోని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. తప్పకుండా తాను వచ్చి విశాఖ పాతపట్నం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. 7వేల ఎకరాలు ఖాళీగా ఉంది.. అమ్మేద్దాం అంటున్నారని.. ఆటవిక రాజ్యాన్ని తేవాలని చూస్తున్నారని విమర్శించారు. అందర్నీ భయపెట్టడం రాజకీయమా? అని ప్రశ్నించారు.
అంతకుముందు విశాఖ జిల్లాలోని కోరమండల్ గేటు వద్ద తెదేపా అధినేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలివ్వం అంటారా? అంటూ అధికార పార్టీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారన్న ఆయన.. వడ్డీలు కట్టలేని పరిస్థితి వస్తే ప్రజల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. వైకాపా పాలనలో ఎక్కడ చూసినా వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు.