CBN on farmer arrest: రైతులకు ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురానికి చెందిన రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్నారు. చేయని తప్పుకు.. సంక్రాంతి పండుగ రోజున నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. పండుగ వేళ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన సర్కార్‌ను.. రైతులోకం క్షమించదని వ్యాఖ్యానించారు.
CBN on farmer arrest: మద్దతు ధర అడిగితే జైల్లో వేస్తారా?: చంద్రబాబు - చంద్రబాబు
ఏపీలో వినుకొండ నియోజకవర్గానికి చెందిన రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. మద్దతు ధర అడిగితే అక్రమంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

farmer Narendra arrest: మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు చంద్రబాబు. ఈ చర్య.. యావత్ రైతు సమాజాన్నే అవమానించిందని అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యిందని.. తప్పుడు కేసు పెట్టిన రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలన్నారు. వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: