చైనాను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కన్నా ఆంధ్రప్రదేశ్లో వైకాపా వైరస్ ఇంకా భయంకరమైనదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ వైరస్ 8 నెలల్లోనే రాష్ట్రాన్ని చెల్లాచెదురు చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు.
కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు - chandra babu fires on jagan
కరోనా వైరస్ కన్నా ఆంధ్రప్రదేశ్లో వైకాపా వైరస్ మరింత ప్రమాదకరమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడిదారులు పారిపోతున్నారని ట్వీట్ చేశారు.
కరోనా వైరస్ కన్నా వైకాపా చాలా ప్రమాదకరం: చంద్రబాబు
విశాఖ మిలీనియం టవర్లోని కంపెనీలను తరిమేసి.. ఐటీ ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేనివాళ్లు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా అని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి:మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...