తెలంగాణ

telangana

ETV Bharat / city

అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలి: చంద్రబాబు - విజయవాడ తాజా వార్తలు

CBN on Vijayawada Rape Incident: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఘటనకే ఆంధ్రప్రదేశ్​కు అవమానమన్నారు. ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

CBN on Vijayawada Rape Incident:
అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

By

Published : Apr 22, 2022, 1:38 PM IST

CBN on Vijayawada Rape Incident: ఏపీలోని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్​ బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం రాష్ట్రానికే అవమానమన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను సిగ్గుపడుతున్నానన్నారు. అత్యాచారం చేసిన శ్రీకాంత్‌, బాబురావు, పవన్‌ కల్యాణ్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పడం ఏంటని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని సీఎంను ప్రశ్నించారు. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది... ఇక్కడకు రావాలని డిమాండ్​ చేశారు. ఏపీలో దిశ చట్టం లేదు.. దిశ యాప్‌ లేదు. కేవలం లేనిదాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details