వైకాపా ఉన్మాదం చూస్తుంటే దిగ్బ్రాంతి కలుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎస్సీ యువకుడు బేతమల మణిరత్నం అరెస్ట్ మరో ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు... గోడపై పోస్టర్ ఉన్న వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంలో హానికరం ఏముందని ప్రశ్నించారు.
ఎస్సీ యువకుని అరెస్ట్ వైకాపా ఉన్మాద చర్య : చంద్రబాబు - తెదేపా కార్యకర్త మణిరత్నం అరెస్ట్ తాజా వార్తలు
ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎస్సీ యువకుడు బేతమల మణిరత్నం అరెస్ట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైకాపా ఉన్మాదం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్విట్టర్ లో విమర్శించారు.
ఎస్సీ యువకుని అరెస్ట్ వైకాపా ఉన్మాద చర్య : చంద్రబాబు
అదే జిల్లాలో బాలికపై అత్యాచారం ఆరోపణలున్న నిందితులు, అరెస్ట్ చేస్తారనే భయం లేకుండా నిర్భీతిగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందన్నారు. నియంతగా మారి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు దుయ్యబట్టారు.