ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు... రైతుభరోసా పేరుతో ఐదేళ్లలో రైతుకు ఇచ్చేది రూ.37,500 మాత్రమేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి రూ. 4 వేల కోట్లు ఇస్తామని రైతులను నమ్మించారని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆక్షేపించారు.
ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్
ఏపీలో రైతు భరోసా పేరుతో ఐదేళ్లలో రైతులకు ఇచ్చేది రూ. 37,500 మాత్రమేనని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టిందని ఆరోపించారు.
తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేశారని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రైతుల వద్దకు వైకాపా నాయకులు వెళ్లకపోగా...బాధితుల వద్దకు వెళ్లిన తెదేపా నేతలపై కేసులు పెడతున్నారని మండిపడ్డారు.
22మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న ముఖ్యమంత్రి జగన్ ప్రగల్భాలు ఏమయ్యాయని చంద్రబాబు నిలదీశారు. పోలవరం పూర్తి చేస్తా, ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్దమనిషి వాటి గురించే ప్రస్తావించటం లేదన్నారు. పోలవరంపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు తెదేపా నేతలకు సూచించారు.