తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ఎందుకివ్వరు?: చంద్రబాబు - వైసీపీ ఇళ్ల పంపిణీ న్యూస్

తెలుగుదేశం హయాంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన లక్షలాది ఇళ్లను ప్రభుత్వం పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదో తెలపాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆ ఇళ్లనే ఇప్పుడు క్వారంటైన్‌ కేంద్రాలకు కేటాయించడంపై మండిపడ్డారు. ఇళ్లు బాగున్నాయంటూ క్వారంటైన్‌లోనే ఉన్న వారే సెల్ఫీ వీడియోలు తీసి పంపుతున్నారని...ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయింపులు చేయకపోవడంపై ఏపీ వ్యాప్తంగా తెదేపా నాయకులు నిరసన తెలిపారు.

తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ఎందుకివ్వరు?: చంద్రబాబు
తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను ఎందుకివ్వరు?: చంద్రబాబు

By

Published : Jul 7, 2020, 7:31 AM IST

‘తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు?’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెదేపా హయాంలో ఐదేళ్లలో గ్రామాలు, పట్టణాల్లో కలిపి రూ.50 వేల కోట్లతో 25.57 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. గ్రామాల్లో రూ.12,145 కోట్లతో 9,94,222 గృహాల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఆ ఇళ్లను ఇప్పుడు క్వారంటైన్‌ కేంద్రాలకు ఇచ్చారని.. తెదేపా ప్రభుత్వం ఇళ్లను ఎంత బాగా కట్టిందో చూడండంటూ ఆ కేంద్రాల్లో ఉన్నవారే సెల్ఫీలు తీసి మీడియాకి పంపుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తయిన ఇళ్లను పేదలకు వెంటనే స్వాధీనం చేయాలంటూ తెదేపా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 102 చోట్ల వర్చువల్‌ ఆందోళనలు నిర్వహించింది. మొత్తం 2,371 మంది హాజరయ్యారు. తెదేపా నిర్వహించిన ఆందోళనలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తెదేపా ప్రభుత్వం 13 జిల్లాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్ని వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిపివేయడం బాధాకరమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దసరాకి 2 లక్షలు, సంక్రాంతికి 4 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు చేశామని చెప్పుకొచ్చారు. 101 నగరాలు, పట్టణాల్లో ఏహెచ్‌పీ కేటగిరీలో 5.24 లక్షల ఇళ్లు, బీఎల్‌సీ కింద 2 లక్షల గృహాల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

వైకాపా నాయకుల జేబులు నింపేందుకే..


‘ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారు. అంటే ఏడాదికి ఐదు లక్షల ఇళ్లు కట్టాలి. దానిలో పదోవంతు కూడా నిర్మించలేదు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో రూ.వందల కోట్ల కుంభకోణాలు చేశారు. ఎకరం రూ.5 లక్షలు చేసే భూమిని రూ.50 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి ఆ మొత్తాన్ని వైకాపా నాయకులే జేబుల్లో వేసుకున్నారు. ఇంటి పట్టాకు దూరాన్ని బట్టి రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.1.10 లక్షల చొప్పున పేదల నుంచి వసూలు చేశారు’ - చంద్రబాబు, తెదేపా అధినేత.

ఇదీ చదవండి: అమరావతి పోరుకు మద్దతుగా.. అమెరికాలో ప్రవాసాంధ్రుల నిరసన

ABOUT THE AUTHOR

...view details