Chandrababu on cyclon: ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే వారంలో సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారన్నారు. ప్రజలను నీటముంచి.. ఆ తర్వాత ప్రభుత్వం హడావిడి చేయడం సరికాదని తెలిపారు. ప్రజలను వరదలకు వదిలేయకుండా ముందుగానే అప్రమత్తం కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అలసత్వమేంటో అంతా చూశామన్నారు. రాయలసీమలో వరదలు, గోదావరి వరదలకు ప్రభుత్వం అలసత్వం వహించిందని ఆరోపించారు.
"ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే వారంలో సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ప్రజలను నీటముంచి ఆ తర్వాత ప్రభుత్వం హడావిడి చేయడం కాదు. ప్రజలను వరదలకు వదిలేయకుండా ముందుగానే అప్రమత్తం కావాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అలసత్వమేంటో అంతా చూశాం. రాయలసీమలో వరదలు, గోదావరి వరదలకు ప్రభుత్వం అలసత్వం వహించింది." -చంద్రబాబు