తెలంగాణ

telangana

ETV Bharat / city

హిందుస్థాన్ షిప్ యార్డు ఘటనపై చంద్రబాబు, లోకేశ్ విచారం - విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ప్రమాదం

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రమాద ఘటనపై తెదేపా చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

chandra babu
chandra babu

By

Published : Aug 1, 2020, 3:32 PM IST

విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్​లోభారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వేడుకున్నారు.

ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిప‌దిక‌న స‌హాయ‌క‌ చ‌ర్యలు చేప‌ట్టి క్షత‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి ప్రకటించిన లోకేశ్... ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో ఘోరప్రమాదం.. 11 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details