తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపాను మళ్లీ గెలిపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు - ap today news

ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజధానుల రెఫరెండంతో ఎన్నికలు వెళ్లాలని పెట్టాలని తెదేపా నేత చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు. విజయవాడ బెంజ్​సర్కిల్​లో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. . జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

chandra-fir
chandra-fir

By

Published : Jan 14, 2020, 7:51 AM IST

తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోరు : చంద్రబాబు
ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా భాష, సంస్కృతిని మర్చిపోవడం లేదని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని అమరావతికి అంతటి ఘన చరిత్ర ఉందన్నారు. వేల సంవత్సరాల క్రితమే రాజ్యంగా ఉన్న.. అమరావతి చారిత్రక ప్రాధాన్యత కాపాడుకోవాలని సూచించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జి.ఎన్‌.రావు కమిటీ, బోస్టన్‌ నివేదిక ప్రతులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని.. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని చంద్రబాబు అన్నారుయ జీఎన్‌రావు కమిటీ నివేదికను భోగి మంటల్లో వేసి పీడ వదిలించుకుంటున్నామన్నారు. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్​ చేశారు. ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజలు మళ్లీ వైకాపానే సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details