తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా' - chandra babu comments on cm jagan

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

chandrababu naidu
chandrababu naidu

By

Published : Jul 17, 2021, 1:01 PM IST

Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'

ఏపీ, తెలంగాణలోని జలవనరుల ప్రాజెక్టులపై కేంద్ర జల్​శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్​పై పూర్తిగా అధ్యయనం చేశాకే.. స్పందిస్తానని తెలుగు దేశం అధినేత చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించారు. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో చంద్రబాబుతో పాటు అర్జునుడు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చంద్రబాబుకు తెలిపారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు చంద్రబాబు. దీనిపై వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం పట్ల బాధ్యత లేకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్​ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

cbnకేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తా: చంద్రబాబు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్దేశించే గెజిట్‌ నోటిఫికేషన్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల కంటే జాగ్రత్తగా రూపొందించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్థి చెప్పారు. రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికున్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సీడబ్ల్యూసీ అధికారులు దీనిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి, రాత్రింబవళ్లు పనిచేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పదాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే నోటిఫికేషన్‌ను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. 2020 అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకే ఈ నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇందులో పేర్కొన్న రెండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టులపై బోర్డులకు 100% నియంత్రణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీచూడండి:

CM KCR: 'రాష్ట్రానికి దక్కాల్సిన నీటివాటాపై కేంద్రాన్ని నిలదీయాలి'

2020 అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే బోర్డులపై నోటిఫికేషన్‌ : కేంద్ర జల్‌శక్తి శాఖ

ABOUT THE AUTHOR

...view details