తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandra Babu: ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా..తప్పుడు కేసులపైనే దృష్టి: చంద్రబాబు - tdp news

ఏపీలో తెదేపా తలపెట్టిన సాధన దీక్షలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే ఏపీ ప్రభుత్వం మాత్రం తేలిగ్గా తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులపై దృష్టి సారించారని దుయ్యబట్టారు.

CBN Speech@Sadana Deeksh
CBN Speech@Sadana Deeksh

By

Published : Jun 29, 2021, 4:19 PM IST

ఏపీలో తెదేపా తలపెట్టిన సాధన దీక్షలో ప్రభుత్వంపై అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి మాత్రం తేలిగ్గా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా.. ఏ మాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించాలని సూచిస్తే.. తప్పుడు కేసులపై దృష్టి సారించారని దుయ్యబట్టారు.

'విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడారు'

పది, ఇంటర్ పరీక్షలు రాసే 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుకోవాలని చూసిందని బాబు విమర్శించారు. పరీక్షల విషయంలో తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించాలనుకున్నారని ఆక్షేపించారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో తోక జాడించారని.. పరీక్షల రద్దు కోసం తెదేపా నేతలు చేసిన పోరాటాన్ని అభినందించారు.

పరిపాలన సత్తా ఉంటే ఉన్న చట్టాలు సరిపోతాయన్న తెదేపా అధినేత.. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్​ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఆగ్రహించారు.

ఇదీ చదవండి:

YS VIVEKA MURDER CASE: ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్న సీబీఐ

ABOUT THE AUTHOR

...view details