Chandrababu news: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని ఓ వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రైతు విజయ్ కుమారుడు చైతన్య పెళ్లికి హాజరైన చంద్రబాబు.. వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు రాకను గమనించిన బంధుమిత్రులంతా జై అమరావతి.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
Chandrababu news: రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు - రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు
Chandrababu news: ఏపీలోని గుంటూరు జిల్లా పెద్దపరిమిలో.. ఓ రైతు కుమారుడి వివాహానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చంద్రబాబు ఆశీర్వదించి వారితో కలిసి ఫొటోలు దిగారు.
రైతు కుమారుడి వివాహానికి చంద్రబాబు
వారి నినాదాలకు బాబు చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రైతుల నినాదాలతో తెదేపా అధినేత కారు దిగి వారికి అభివాదం చేశారు.