ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. తిరుపతిలోకి బయట వ్యక్తులు భారీగా చొరబడ్డారని ఫిర్యాదు చేశారు. ఫొటో ఆధారాలను జత చేసి సీఈవోకు ఫిర్యాదు చేశారు. బయటి వ్యక్తులు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోకి ప్రవేశించారని లేఖలో పేర్కొన్నారు. రెండు బస్సుల్లో తిరుపతిలోకి వైకాపా నేతలు బయటి వ్యక్తుల్ని తరలించారని ఆరోపించారు.
తిరుపతిలోకి బయట వ్యక్తులు చొరబడ్డారు: చంద్రబాబు
ఏపీలోని తిరుపతిలోకి బయట వ్యక్తులు చొరబడ్డారని ఆరోపిస్తూ.. అందుకు తగిన ఫొటో ఆధారాలను జత చేస్తూ.. ఆ రాష్ట్ర సీఈవోకు తెదేపా అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. రెండు బస్సుల్లో తిరుపతిలోకి వైకాపా నేతలు బయటి వ్యక్తుల్ని తరలించారని లేఖలో ఆరోపించారు.
చంద్రబాబు, చంద్రబాబు నాయుడు, ఏపీ తెదేపా
వైకాపా నేతలు కొన్ని పోలింగ్ బూత్‌లలో తెదేపా ఏజెంట్లను అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. స్థానికేతరులతో రిగ్గింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తొట్టెంబేడు మండలం కందేలుగుంటలో తెదేపా ఏజెంట్లను అడ్డుకున్నారని లేఖ ద్వారా తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, వాహనాలను తనిఖీ చేయాలని కోరారు. హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్‌పై అధికారులు నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు.