తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu on Jagan: 'ఓ వైపు విధ్వంసం.. మరోవైపు ప్రజలపై భారం.. అదే జగన్‌ పాలన'

ఏపీలో పెట్రో ధరలు తగ్గించేవరకు తెదేపా పోరాటం చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈనెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని సీఎం జగన్‌ గతంలో చెప్పారని చంద్రబాబు అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని ఆరోపించారు.

Chandrababu on Jagan
జగన్​పై చంద్రబాబు ఫైర్​

By

Published : Nov 6, 2021, 3:06 PM IST

ఇతర రాష్ట్రాల్లో కన్నా ఆంధ్రప్రదేశ్​లోనే పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించినా.. రాష్ట్రంలో పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేసిన జగన్​.. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ది తుగ్లక్‌ పాలన కాక మరేమిటని ఎద్దేవా చేశారు.

ఈనెల 9న ఆందోళనలు..

రాష్ట్రంలో పెట్రో ధరలు తగ్గించేవరకు తెదేపా పోరాటం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఈనెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్రో ధరలు కనీసం రూ.16 వరకు తగ్గించి తీరాలని డిమాండ్​ చేశారు. ప్రజలంతా చైతన్యవంతులై జగన్ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. పెట్రో ధరలు పెరిగితే పరిశ్రమలు, వ్యవసాయానికి కష్టమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో జగన్‌ చేసింది విధ్వంసం, పన్నుల బాదుడు మాత్రమే అని విమర్శించారు.

ఈ నెల 9న అన్ని పెట్రోలు బంకుల వద్ద ఆందోళనలు

'అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారు. ఓ వైపు విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్‌ పాలన. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, కేసులతో వేధిస్తున్నారు. అధికారం ఉందంటే కుదరదు.. ప్రజలు తిరగబడితే పారిపోతారు' - చంద్రబాబు

వ్యవస్థలన్నీ నిర్వీర్యం..

జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న కూడా విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని చంద్రబాబు అన్నారు. కాజా టోల్‌గేట్‌ వద్ద పట్టుబడిన గంజాయిపై డీజీపీ సమాధానమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. గంజాయి మొత్తం మార్కెట్‌లోకి వస్తే పరిస్థితేంటని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే జగన్‌ ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. ద్రవిడ వర్శిటీ రిజిస్ట్రార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులను వదిలిపెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

ఇదీ చదవండి:Liquor Sales: మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు.. 350కిపైగా పెరిగే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details